02 October 2023
మీనాక్షికి మరో క్రేజీ ఆఫర్.. బాలయ్య జోడిగా గుంటురు కారం హీరోయిన్..
Pic credit - Instagram
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు మీనాక్షి చౌదరి. హిట్ 2 సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది మీనాక్షి.
దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 5 చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మరో బంపర్ ఆఫర్ అందుకుందట మీనాక్షి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి తర్వాతి ప్రాజెక్టులో మీనాక్షి సెలక్ట్ అయిందట.
అలాగే ఇప్పుడు తెలుగులోనూ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది నందమూరి హీరో బాలకృష్ణ జోడిగా మీనాక్షి కనిపించనుందని టాక్.
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మీనాక్షి కథానాయికగా కనిపించనుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ తెలుగులో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది మీనాక్షి.
తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉంది మీనాక్షి. ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చేయండి.