4 నెలల్లో 3 బ్లాక్ బస్టర్స్.. 850 కోట్లకు పైగా కలెక్షన్లు.. లక్కీ హీరోయిన్
03 February 2025
Basha Shek
4 నెలల్లో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు.. 850 కోట్లకు పైగా కలెక్షన్ల తో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.
ప్రస్తుతం ఈ అందాల తారకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఈ బ్యూటీ వెంట పడుతున్నారు.
ఇలా ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి లక్కీ మస్కట్ గా మారిపోయిన ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మీనాక్షి చౌదరి
గతేడాది దుల్కర్ సల్మాన్ తో కలిసి మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్ సినిమా ఆమె ఖాతాలోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అటు దుల్కర్, మీనాక్షి కెరీర్ లో ఇదే మొదటి వంద కోట్ల సినిమా
ఇక మీనాక్షి నటించిన మరో సినిమా గోట్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన ఈ మూవీ రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
ఇక ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో హిట్టు కొట్టింది మీనాక్షి. ఈ మూవీ కూడా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇలా కేవలం 4 నెలల గ్యాప్‌లోనే 3 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి రూ.850 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన హీరోయిన్‌గా మీనాక్షి రికార్డు సృష్టించింది.
ఇక్కడ క్లిక్ చేయండి..