ప్రేమలు బ్యూటీకి బంపరాఫర్.. ఆ స్టార్ హీరో కు చెల్లెలిగా మమితా బైజు
TV9 Telugu
06 August 2024
మమితా బిజు 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'సర్వోపరి పాలక్కారన్' ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో మమితా నటించింది.
అయితే ఈ ఏడాది విడుదలైన ‘ప్రేమలు’ సినిమా ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత మమితాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి.
అయితే ఈ ఏడాది విడుదలైన ‘ప్రేమలు’ సినిమా ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత మమితాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే దళపతి విజయ్ తదుపరి చిత్రంలో మలయాళ నటి మమితా బైజు కూడా నటించవచ్చని వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి 'దళపతి 69' అనే టైటిల్‌ను తాత్కాలికంగా ఖరారు చేశారు. ఈ సినిమాలో మమిత కూడా ఓ పాత్రలో నటిస్తుందని తమిళ మీడియా పేర్కొంది.
దళపతి 69' చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. నివేదికల ప్రకారం, మమిత ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తోంది.
యితే విజయ్ సోదరి పాత్రలో మమితా నటిస్తోందని మరో రూమర్ వస్తోంది. ఇది విని ఆయన అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
కాగా ప్రస్తుతం 'GOAT' అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దళపతి. ఆ తర్వాత తన కెరీర్‌లో చివరి సినిమా చేయనున్నాడని సమాచారం.
Learn more