15 December 2023

Pic credit - Instagram

యానిమల్ సిక్వెల్‏లో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్.. 

మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ఇప్పటివరకు ఈ బ్యూటీ నేరుగా తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. కానీ ఫాలోయింగ్ మాత్రం వచ్చేసింది. 

రజినీకాంత్ నటించిన పేట సినిమాతో  ఈ ముద్దుగుమ్మకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమాలో నటించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. 

దీంతో కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన మారన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీతో అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగింది. 

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ బ్యూటీ యాక్షన్ సీన్స్ నెట్టింట లీక్ అయిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ ముద్దగుమ్మ మరో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టిస్తోన్న యానిమల్ సిక్వెల్‏లో మాళవికకు ఛాన్స్ వచ్చినట్లు టాక్ నడుస్తుంది.

డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ చిత్రానికి త్వరలోనే సిక్వెల్ తీసుకువస్తున్నారట. అయితే ఇందులో మాళవిక నటించనుందట. 

సెకండ్ పార్టులో రష్మికతోపాటు.. మాళవిక మోహనన్ కూడా కనిపిచనుందని అంటున్నారు. అయితే రష్మిక సీక్వెల్ లో ఉంటుందా ?లేదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. 

ప్రస్తుతం ఈ బ్యూటీ విక్రమ్ చియాన్ నటించిన తంగలాన్ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.