13 September 2023

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన 'సలార్' మేకర్స్.. 

Pic credit - Instagram

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం సలార్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

ఇందులో డార్లింగ్ ప్రభాస్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై ఓ రెంజ్ లో ఆసక్తిని క్రియేట్ చేసింది. 

అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. 

దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీకు అద్భుతమైన సినిమాను అందివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాను మరింత తీర్చిదిద్ధుతాం. 

సలార్ చిత్రానికి ఫైనల్ టచ్ ఇస్తున్నాం. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ప్రకటించారు. 

దీంతో ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే ఎదురయ్యింది.  ఈ సినిమాను వాయిదా వేస్తున్నామంటూ ప్రకటించారు. 

ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. 

కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండడం, ప్రభాస్ నటిస్తుండడంతో ఈ సినిమాపై ఇప్పటికే ఎక్కువగా అంచనాలు మరింత పెరిగాయి.