04 February 2024

గుంటురు కారం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడంటే.. 

TV9 Telugu

Pic credit - Instagram

సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి పండక్కి జనవరి 12న ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. 

అమ్మ సెంటిమెంట్‏తోపాటు మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో శ్రీలీల, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మీనాక్షి చౌదరీ, ఈశ్వరీ రావు కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. 

ఈ మూవీకి అన్ని వర్గాల అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ సినిమాగా గుంటూరు కారం కొత్త రికార్డ్ అందుకుంది. 

 ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసేందుకు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లి్క్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. 

 అతడు, ఖలేజా సూపర్ హిట్స్ తర్వాత గురూజీ, మహేష్ కాంబోలో వచ్చిన మూవీపై విడుదలకు ముందే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అదే క్రమంలో హిట్ అయ్యింది ఈ సినిమా. 

ఈ సినిమా ప్రీమియర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్నప్పుటీ.. ఆ తర్వాత మాత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు రాబట్టింది. 

ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతుంది. రౌడీ రమణగాడిని ఇప్పుడు ఓటీటీలో చూసేయ్యండి అంటూ పోస్ట్ చేశారు మేకర్స్.