సితారకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?  ఊహించలేరు

Rajeev 

31 AUG 2024

మహేశ్ బాబు కూతురిగానే కాకుండా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార ఘట్టమనేని.

తన తల్లిదండ్రుల బాటల్లోనే అడుగులు వేస్తోన్న సితార ఓ జ్యువెల్లరీ యాడ్ చేసింది. దీనికి ప్రశంసలు కూడా వచ్చాయి.

ఇక తాను చేసిన జ్యువెల్లరీ యాడ్ చూసి తన తండ్రి దాదాపుగా ఏడ్చినంత పనిచేశారని చెప్పుకొచ్చింది సితార ఘట్టమనేని

ఇదిలా ఉంటే సితారకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు  సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది.

ప్రస్తుతం స్కూల్ చదవులతో బిజీగా ఉన్న సితార ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్, స్టడీ, ఫ్యామిలీ విషయాలను పంచుకుంది

ఇదే సందర్భంలో తన ఫేవరేట్ స్టార్ ఎవరని అడగ్గా.. తనకు రష్మిక మందన్నా, శ్రీలీల ఇద్దరు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది సితార.

ఇక ఫేవరేట్ హీరో ఎవరని అడగ్గా..  ఏ మాత్రం ఆలోచించకుండా తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలిపిందీ స్టార్ కిడ్.

ఇక ప్రస్తుతం దర్శక ధీరుడు  రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సబ్జెక్టుతో సినిమా తీస్తున్నాడు మహేశ్ బాబు.