02 October 2023
దేవర సినిమాలో కృతి సనన్.. స్పెషల్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ..
Pic credit - Instagram
ఆదిపురుష్ సినిమాతో మరోసారి దక్షిణాది ప్రేక్షకులను పలకరించింది కృతి సనన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం మిక్డ్స్ టాక్ అందుకుంది.
అయితే ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించిన కృతి సనన్.. మరోసారి తన నటనతో విమర్శకుల ప్రశంసుల అందుకుంది కృతి.
తాజాగా ఈ బ్యూటీ మరో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర చిత్రంలో ఈ హీరోయిన్ ఎంపికైనట్లుగా టాక్.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. మాస్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ హైలెట్ కానుందట.
తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కృతి సనన్ స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్ విపిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రాలేదు.
ఇక ఇటీవల కృతిసనన్ నటించిన చిత్రం గణపథ్. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ఇందులో ప్రధాన పాత్రలో నటించగా.. అమితాబ్ కీలకపాత్ర పోషించారు.
అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో కొద్ది రోజులుగా గణపథ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది కృతి. ఆ తర్వాత దేవర సెట్ లో అడుగుపెట్టనుంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో జాన్వీ కపూర్ నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.