30 December 2023
Pic credit - Instagram
కృతిసనన్ గ్లోయింగ్ స్కిన్ రహస్యం ఇదే.. బ్యూటీ సీక్రెట్ ఏంటంటే..
TV9 Telugu
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత దోచేయ్ సినిమాలో నటించింది.
తెలుగులో ఆమె నటించిన చిత్రాలు సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. ఇటీవలే ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో నటించింది.
ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తున్న కృతి.. తాజాగా బ్యూటీ సీక్రెట్ బయటపెట్టింది.
తన స్కిన్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ బ్యూటీ.. ఇప్పుడు తన చర్మ సౌందర్యం కోసం ఏం చేస్తుందో రివీల్ చేసింది. ఇంతకీ ఏం చేస్తుందంటే..
రోజూ తన చర్మ సౌందర్యం కోసం ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుతుందో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో కొన్ని చాలా తక్కువ ధరకే ఉండడం విశేషం.
సాధారణంగా హీరోయిన్స్ చాలా బ్రాండెడ్ వస్తువులను, ఖరీదైన మేకప్, స్కిన్ కేర్ ఫాలో అవుతుంటారని అనుకుంటాం. కానీ కృతి చెప్పినవి సాధరణమైనవి.
DIY టోనర్ అప్లై చేసి రోజ్ వాటర్ ఉపయోగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్-రిచ్ గోల్డెన్ అవర్ గ్లో సీరం తర్వాత వింటర్ క్రీమ్ ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
కనుబొమ్మల కోసం ఆముదం + ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తుందట. మొత్తం 7 స్టెప్స్‌లో డబుల్ క్లెన్సింగ్ తో స్టార్ట్ చేసి లిప్ బామ్ తో ముగిస్తుందని చెప్పింది.
ఇక్కడ క్లిక్ చేయండి.