బేబమ్మ ఆశలన్ని ఆ సినిమా పైనే.. ఆ హీరోతో జోడి కట్టేస్తోన్న కృతి... 

27 September 2023

Pic credit - Instagram

ఉప్పెన సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాలను దొచేసింది కృతి. ఈ మూవీతో బేబమ్మగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఈ హీరోయిన్. 

ఈ సినిమాలో కృతిని చూసి.. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోకి ఇంత అందమైన, చలాకీ అమ్మాయి కథానాయికగా రాలేదని అనుకున్నారు అంతా. 

ఆకర్షణీయమైన కళ్లు.. అందమైన నవ్వు చూసి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 

ప్రస్తుతం మలయాళంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో కేవలం ఒక్క సినిమా ఛాన్స్ మాత్రమే ఉంది.

ఇప్పుడు ఈ బ్యూటీ టాలెంటెడ్ హీరో శర్వానంద్ 35వ సినిమాలో నటిస్తుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనను కృతి పుట్టినరోజున వచ్చింది. 

ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకుందని అంటున్నారు ఫిల్మ్ వర్గాల్లో. 

అయితే ఈ సినిమా హిట్ అయితే తెలుగులో కృతికి మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఉప్పెనతోపాటు.. శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు హిట్స్.

ఆ తర్వాత కృతి నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అటు తమిళంలోనూ కృతికి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.