ప్రేమ, బాధ, ద్వేషం ఎన్నో భావోద్వేగాలను అనుభవించాను.. కృతి శెట్టి.. 

21 September 2023

Pic credit - Instagram

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి శెట్టి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. 

దీంతో తెలుగులో కృతికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు సినిమాలతో హిట్స్ అందుకుంది కృతి శెట్టి. 

అయితే ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో కృతికి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. 

సెప్టెంబర్ 21న కృతి శెట్టి బర్త్ డే. ఈ సందర్భంగా బేబమ్మకు సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ క్రమంలోనే కృతి అభిమానులను ఉద్దేశిస్తూ ఓ నోట్ షేర్ చేసింది. ప్రస్తుతం కృతి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. 

మరో ఏడాదిలోకి అడుగుపెట్టాను. ఎన్నో విషయాలపై కృతజ్ఞతతో ఉన్నాను. సంతోషం, బాధ, ప్రేమ, ద్వేషం అన్ని భావోద్వేగాలను అనుభవించాను. 

అవన్నీ నన్ను ఈరోజు ఈ స్థానంలో ఉండేలా చేశాయి. నాకెంతో సపోర్ట్ చేస్తూ నాలో స్పూర్తి నింపుతున్న నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. 

 అలాగే నేను వేసే ప్రతి అడుగులో నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ కృతి శెట్టి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.