లవ్‌టుడే హీరో సరసన కృతి శెట్టి.. కొత్త సినిమా మొదలెట్టిందిగా..
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కృతి శెట్టి. తొలి చిత్రానికి ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముంభై ముద్దుగుమ్మ.
ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది కృతి. శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు సినిమాలతో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది కృతి.
ఆ తర్వాత కృతి ఖాతాలో వరుస డిజాస్టర్స్ వచ్చి చేరాయి. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది.
తాజాగా మరో ఆఫర్ అందుకుంది కృతి. లవ్ టుడే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ జోడిగా నటించనుంది కృతి శెట్టి.
కృతి, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఈ సినిమాకు లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఎస్జే సూర్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాకు నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. తన కలల ప్రాజెక్ట్ నిజం చేసినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు విఘ్నేష్.
లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) సినిమాలో ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి, ఎస్జే సూర్య, యోగిబాబు ప్రధాన పాత్రలలో నటిస్తుంచనున్నట్లు తెలుస్తోంది.