'అవును.. రిలేషన్‌లో ఉన్నా'.. షాకింగ్ న్యూస్ చెప్పేసిన బేబమ్మ.

TV9 Telugu

04 June 2024

ప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయిందీ అందాల తార.

అయితే ఆ తర్వాత కృతి చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఈ సినిమాలన్నింటిలోనూ కృతి నటనకు వంక పెట్టడానికి లేదు.

చాలా రోజుల తర్వాత శర్వానంద్ తో కలిసి 'మనమే' అనే సినిమాతో మన ముందుకు వస్తోంది కృతి శెట్టి.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

ఇక కృతిశెట్టి కూడా వరుసపెట్టి టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. తనకు ఎదురవుతున్న చిలిపి ప్రశ్నలకు కూడా తెలివిగా సమాధానాలిచ్చేస్తోంది.

తాజాగా 'మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నేను సింగిల్‌ కాదు. రిలేషన్‌లోనే ఉన్నా’ అని ముక్కుసూటిగా సమాధానమిచ్చేసింది.

‘ఎవరితో?’ అనడిగితే.. ‘నా పనితో.. నా పనితో రిలేషన్‌లో ఉన్నా’ అంటూ అసలు విషయం చెప్పేసింది మన  బేబమ్మ

కట్టుకునే వాడు ఎలావుండాలి? అనడిగితే.. ‘మంచివాడై ఉండాలి. నిజాయితీపరుడై ఉండాలి. తోటి వారిపై దయ కలిగినవాడై ఉండాలి’ అని సిగ్గుపడిపోయింది.