Rajeev
గేమ్ చెంజర్‌తో కియారా సినీ కెరీర్ చేంజ్ అయ్యేనా..
06 March 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ కియారా అద్వానీ
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత రామ్ చరణ్ తో వినయవిధేయ రామ సినిమాలో నటించింది.
ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది కియారా అద్వానీ. అక్కడ వరుస సినిమాలతో ;ఫుల్ బిజీగా మారిపోయింది.
బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తిరిగి తెలుగులోకి అడుగుపెడుతోంది.
మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించనుంది కియారా అద్వానీ. గేమ్ చెంజర్ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా తర్వాత కియారా తెలుగులో బిజీ అవుతుందని అంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. చాలా మంది ఈ ముద్దుగుమ్మను ఫాలో అవువైతుంటారు.
ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేయకుండా రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
ఈ క్రమంలో కియారా అద్వానీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు లైకులు వర్షం కురిపిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి