01 October 2023

తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కాంతార హీరోయిన్.. సప్తమి గౌడ.. 

Pic credit - Instagram

రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో క్రేజ్ అందుకుంది హీరోయిన్ సప్తమి గౌడ.

ఈ మూవీతో కన్నడతోపాటు దేశవ్యాప్తంగా స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది సప్తమి గౌడ. అయితే కాంతార తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. 

ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో నేరుగా ఓ సినిమా చేయబోతుందట. త్వరలోనే నితిన్ తమ్ముడు మూవీతో తెలుగులోకి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. 

సప్తమి స్వస్థలం బెంగుళూరు. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సప్తమికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడే నేషనల్ లెవల్ పోటీల్లో గెలిచింది. 

నటన మీదున్న ఆసక్తితో సినిమా అవకాశాల కోసం ముందుగా మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పాప్ కార్న్ మంకీ టైగర్ తొలి చిత్రం. 

ఈ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సప్తమి.. మొదటి చిత్రంలోని తన నటనకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్ అందుకుంది. 

కాంతారా తర్వాత సప్తమి ది వ్యాక్సిన్ వార్ చిత్రంలో నటించింది. అలాగే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో యువ, కాళి, కాంతార ప్రీక్వెల్ చిత్రాలున్నాయి. 

ఇక తర్వలోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. నితిన్ నటిస్తోన్న తమ్ముడు చిత్రంలో ఈ బ్యూటీ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.