'కాంతార 2' సినిమా హీరోయిన్ ఏం చదువుకుందో తెలుసా?
04 October 2025
Basha Shek
కాంతార 2 సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. ఇందులో ఆమె అందం, అభినయానికి ప్రశంసలు లభిస్తున్నాయి.
కాగా సప్త సాగరాలు దాటి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్ర ఇచ్చింది రుక్మిణి. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
దీని తర్వాత పలు తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించిందీ అందాల తార. కానీ ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదీ ముద్దుగుమ్మకు.
ఇప్పుడు కాంతార2 తో ఎట్టకేలకు అది కూడా నెరవేరింది. ఈ సినిమాలో రాణి కనకవతిగా రుక్మిణీ నటన అందరినీ మెప్పించింది
రుక్మిణి వసంత్ 1994 డిసెంబరు 10న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్.
2007లో జమ్మూ-కాశ్మీర్‌లోని ఉరీ ఘటనలో తన ప్రాణాలను సమర్పించి, మరణానంతరం అశోక చక్రం పొందారు వేణు గోపాల్.
ఇక ఆర్మీ నేపథ్యం కావడంతో పలు చోట్ల విధ్యాభ్యాసం సాగించింది రుక్మిణీ. ఇక లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ లో కూడా శిక్షణ పొందింది.
అక్కడ ఆమె యాక్టింగ్, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఇండస్ట్రీలో నిలవడానికి బలమైన పునాది ఏర్పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..