27 September 2023
పాల కడలిలో అందాల దేవకన్యలా కళ్యాణి ప్రియదర్శన్..
Pic credit - Instagram
కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. తెలుగుతోపాటు.. మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది.
ఈ ముద్దుగుమ్మకు సౌత్ ఇండస్ట్రీలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. 2017లో హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం, హీరో, చిత్రాల్లో నటించింది.
తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. పాలకడలిలో దేవకన్యలా కనిపిస్తుంది కళ్యాణి.
వైట్ అండ్ వైట్ డ్రెస్‌తో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. దీంతో కళ్యాణి లేటేస్ట్ ఫోటోస్ చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
1993 ఏప్రిల్ 5న చెన్నైలో జన్మించింది కళ్యాణి. ఆమె తండ్రి తమిళ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత ప్రియదర్శన్ కాగా.. తల్లి నటి లిస్సీ.
చెన్నైలోని లేడీ ఆండాళ్ లో పాఠశాల విద్యను అభ్యసించిన కళ్యాణి.. ఆ తర్వాత సింగర్ పూర్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది ఈ హీరోయిన్.
ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇక్కడ క్లిక్ చేయండి.