పెళ్ళైన తగ్గని చందమామ అందం..
5 August 2023
Pic Credit - Instagram
టాలీవుడ్లో చాన్నాళ్లు అగ్రనటిగా ఉన్న కాజల్. పలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది.
యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లోనూ నటించి.. మెప్పించింది ఈ అందాల చందమామ
పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. తన కుటుంబంతో కాస్త టైం స్పెండ్ చేసింది.
గౌతమ్‌ను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో ఆటపాటలు ఆడుతూ.. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టింది.
పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చి అదరగొడుతోంది ఈ చందమామ కాజల్.
బాలకృష్ణ సరసన భగవంత్ కేసరిలో నటిస్తున్న కాజల్. అలాగే సత్యభామ అనే సినిమాలోనూ చేస్తోంది.
ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది.
మునుపటి అందంతో వెండితెరపై మెప్పించేందుకు సిద్ధమైంది చందమామ కాజల్ అగర్వాల్.
వీలుచిక్కినప్పుడల్లా ఫోటోషూట్లతో తన ఇన్‌స్టాను నింపేస్తోంది ఈ బ్యూటీ.