సైమా అవార్డ్స్ 2023 వేడుకల్లో మెరిసిన సినీతారలు..
16 September 2023
Pic credit - Instagram
శుక్రవారం దుబాయ్లో ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన అత్యుత్తమ చిత్రాలు, నటీనటుల ప్రతిభను గుర్తించే ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వేడుకలకు తెలుగుతోపాటు, కన్నడ, తమిళం, మలయాళం భాషల నటీనటులు హజరయ్యారు. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డ్ అందుకున్నారు.
అలాగే ఉత్తమ నటిగా శ్రీలీల అవార్డ్ అందుకోగా.. సీతారామం సినిమాతో ఉత్తమ నూతన నటిగా మృణాల్ ఠాకూర్ సైమా అవార్డ్ అందుకున్నారు.
అలాగే భీమ్లా నాయక్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా రానా దగ్గుబాటి అవార్డ్ అందుకున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నారు.
ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్ గా శ్రుతి హాసన్ అవార్డ్ గెలుచుకుంది. ఈ వేడుకలలో బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ సందడి చేసింది.
అలాగే రెడ్ కలర్ ట్రెండీ డ్రెస్ లో మెరిసింది అనన్య నాగళ్ల. నిషా కళ్లతో సరికొత్త లుక్లో గ్లామర్ ఫోజులతో అవార్డ్ వేడుకలో మాయ చేసింది.
ఈ వేడుకలలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, రిషబ్ శెట్టి, మంచు లక్ష్మి, ఇతర భాషా నటీనటులు పాల్గొన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.