తారక్ బర్త్ డే ట్రీట్ అదిరిపోయిందిగా.. ఏకంగా 3 సినిమాల అప్డేట్.
Anil Kumar
17 May 2024
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుండి చాలా రోజులుగా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట దేవర సినిమా అప్‌డేట్ గురించి..
ఇంత కాలం రోజుల అభిమానుల నిరీక్షణకు.. ఇన్ని రోజుల తరువాత దేవర సినిమాపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది..
మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా దేవర ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇక అదే రోజు తారక చేస్తున్న ఇతర ప్రాజెక్ట్స్ నుండి కూడా అప్డేట్స్ రానున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
బాలీవుడ్ లో హృతిక్ కలిసి చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వార్ 2 మూవీ నుండి లుక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు.
అలాగే కేజీఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ వచ్చే అవకాశం చాలానే ఉంది.
ఆర్ఆర్ఆర్ తో తారక్ క్రేజ్ వేరే లెవల్ కు చేరింది. దేశ , విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు తారక్.
అలాగే తారక్ కూడా తనను ఈ స్థాయికి తెచ్చిన అభిమానులను ఎంతో గౌరవిస్తూ మాట్లాడటం చాల సందర్భాలలో జరిగిందే.
ఇక్కడ క్లిక్ చెయ్యండి