పాన్ ఇండియా ప్రాజెక్టులో జాన్వీ కపూర్.. ఫస్ట్ టైమ్ ఈ హీరో జోడిగా..
TV9 Telugu
Pic credit - Instagram
ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది జాన్వీ కపూర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.
అలాగే అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోను వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్.. కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తుంది జాన్వీ కపూర్.
ఈ క్రమంలోనే తాజాగా మరో భారీ ఛాన్స్ కొట్టేసింది. అది కూడా రూ.500 కోట్లతో నిర్మించనున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ అందుకుంది జాన్వీ కపూర్.
డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ డైరెక్ట్ర రాకేష్ ఓం ప్రకాష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట.
మహాభారత ఇతిహాసాన్ని రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. ఇందులో జాన్వీని ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తుంది.
ఈ సినిమాతో అటు కోలీవుడ్ అరంగేట్రం చేయబోతుంది జాన్వీ. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నాయి బీటౌన్ ఫిల్మ్ వర్గాలు.
ధడక్ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన జాన్వీ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం బీటౌన్ లో టాప్ స్టార్ హీరోయిన్లలో ఒకరు.
ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. దేవర తర్వాత జాన్వీ తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.