ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం చేయను: జాన్వీ కపూర్

05 October 2024

Basha Shek

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఇందులో జాన్వీ పాప అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. దేవర2లో జాన్వీ పాత్రకు మరింత స్కోప్ ఉండనుంది.

 కాగా దివంగత అందాల నటి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అతి తక్కువ కాలంలోనే అందం, అభినయం పరంగా హిందీ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దేవర సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ అమ్మడు తన తల్లితో అన్న మాటలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది.

ఇదే సందర్భంలో జాన్వీ చేసిన కొన్ని కామెంట్లు సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి. అవేంటంటే..

ఏ సినిమాలో అయినా జుట్టు లేకుండా ఉండే పాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటే తాను అస్సలు చెయ్యనని చెప్పిందట జాన్వీ.

నా జుట్టు కట్ చేసుకోవడానికి నేను అసలు ఇష్టపడనంటూ జాన్వీ చేసిన కామెంట్స్ పై అభిమానులు షాక్ అవుతున్నారు.