30 September 2023
హైదరాబాద్కు మకాం మార్చేసిన జాన్వీ కపూర్ ?కోట్ల రూపాయాలతో ఇల్లు..
Pic credit - Instagram
ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రానికే సూపర్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత బీటౌన్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ దక్షిణాది పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసేందుకు రెడీ అయింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర చిత్రంలో నటిస్తుంది జాన్వీ కపూర్. ఇందులో చేపలు పట్టే కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రను పోషిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై, హైదరాబాద్ మధ్య తిరగడం ఆమెకు ఇబ్బందిగా మారిందట. దీంత హైదరాబాద్ లో రూ.3 కోట్లతో ఓ ఇంటిని కొన్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే తన మకాంను హైదరాబాద్ కు మారుస్తుందని బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కొన్ని రోజులు ఇక్కడ.. కొన్ని రోజులుగా ముంబైలో ఉండనుందట.
ఇక దేవర సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో మరిన్ని చిత్రాలు చేసేందుకు రెడీ అవుతుందట జాన్వీ. అవకాశం వస్తే తమిళంలోనూ కొన్ని సినిమాలు చేయనుందట.
అటు సోషల్ మీడియాలోనూ జాన్వీ కపూర్ చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చేయండి.