తెలుగులో మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో జాన్వీ! ఇక్కడే సెటిల్ అయిపోద్దేమో!

TV9 Telugu

05 June 2024

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిందీ జూనియర్ శ్రీదేవి.

ఇక టాలీవుడ్ పై కూడా ఫోకస్ సాధించింది జాన్వీ కపూర్. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైంది.

ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న బిగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా జాన్వీ ఫైనలైజ్ అయినట్టు సమాచారం.

త్వరలో జాన్వీ కపూర్.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉందని తెలుస్తోంది.

వీటితో పాటు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ లో కూడా జాన్వీ భాగం కానున్నట్టు సమాచారం.

అయితే ప్రస్తుతానికి ఇవన్నీ జస్ట్ కేవలం రూమర్లు.. జాన్వీ, మహేశ్ అలాగే ప్రభాస్- జాన్వీల జంటను తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక ఎన్టీఆర్ తో కలిసి జాన్వీ కపూర్ నటిస్తోన్న దేవర సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.