ప్రభాస్‏కు ఇవ్వడమే కానీ తిరిగి తీసుకోవడం తెలీదు.. జగపతి బాబు.. 

19 September 2023

Pic credit - Instagram

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. 

ప్రస్తుతం ఆయన సలార్, కల్కి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ రెండు మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ప్రభాస్ కు ఇవ్వడం తప్ప తిరిగి అడగడం తెలీదని అన్నారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్, రాజమౌళి ఫ్యామిలీ గురించి చెబుతూ వారిని  పొగడ్తలతో ముంచేత్తారు. ప్రభాస్ ఎంతో మంచి మనిషి అన్నారు. 

ఎవరు ఏ సాయం కావాలన్నా ప్రభాస్ చేస్తాడని.. ఒకసారి తాను సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభాస్ కు ఫోన్ చేశాను. అప్పుడు అతను విదేశాల్లో ఉన్నాడు. 

విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే నా వద్దకు వచ్చి డార్లింగ్ నేను ఉన్నాను. నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పు నేను చూసుకుంటాను అని అన్నారు. 

ఆ సమయంలో అతడు నాతో మాట్లాడిన మాటలు నాలో దైర్యం ఇచ్చాయి. అలాగే ప్రభాస్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు జగపతి బాబు. 

ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమాలో జగపతి బాబు ఓ కీలకపాత్రలో నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంది.