23 January 2024

షాకిస్తున్న దళపతి రెమ్యునరేషన్.. భారీగా వసూలు చేస్తోన్న విజయ్.. 

TV9 Telugu

Pic credit - Instagram

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంతోనే కాకుండా తెలుగులోనూ భారీగా అభిమానులను సంపాదించుకున్న హీరో. 

ఇటీవలే లియో సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు విజయ్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ త్రిష నటించిన సంగతి తెలిసిందే. 

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి నటిస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. 

ఇందులో విజయ్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో జయరామ్, మైక్ మోహన్, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్, వైభవ్, యోగి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ సినిమా తర్వాత విజయ్ మరో ప్రాజెక్టులో నటించనున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే..

విజయ్ తన తదుపరి సినిమాకు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఎంత అనే విషయంలో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. 

ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుందని అంటున్నారు. 'తలపతి 69' చిత్రాన్ని గ్రాండియర్‌కు లోటు లేకుండా నిర్మిస్తారని  ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. 

వారసుడు సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు విజయ్. అంతకు ముందు అతను నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.