సాయి పల్లవికి వింత అలవాటు.. రోజూ అది తప్పకుండా తినాల్సిందేనట

02  February 2025

Basha Shek

గార్గి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ రీ ఎంట్రీ ఇచ్చింది బాక్సాఫీస్ క్వీన్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.

ఇప్పుడీ సక్సెస్ ను కొనసాగించేందుకు అక్కినేని నాగ చైతన్య తో కలిసి తండేల్ మూవీతో మన ముందుకొస్తోందీ అందాల తార. 

ఇప్పటికే తండేల్ మూవీ  నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా సాయి పల్లవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోక వచ్చాయి. అదేంటంటే..

సాధారణంగా ఏ దేవాలయానికైనా వెళ్లినప్పుడు చాలా మంది కాస్త విభూతి తీసుకొని నోట్లో వేసుకుంటుంటారు.

 అయితే మన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మాత్రం విభూతిని ఒక ఆహార పదార్థంగా స్వీకరిస్తుందట.

తనకు ప్రతి రోజూ క్రమం తప్పకుండా విభూతి తినే అలవాటుందని గతంలో ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి

విభూతిని ఒక ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేస్తారని, అది తింటే ఒక రకమైన సాంత్వన చేకూరుతుందని అంటోంది సాయి పల్లవి.