కాజల్ పుట్టిన రోజు స్పెషల్.. ఎన్నో బర్త్‌డేనో తెలుసా?
19 May 2025
Basha Shek
ఒకప్పటి సౌతిండియన్ స్టార్ హీరోయిన్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇవాళ (మే19) తన పుట్టిన రోజును జరుపుకొంటోంది.
పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాజల్ అగర్వాల్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోన్న వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు
2007లో నందమూరి కల్యాణ్ రామ్, తేజ కాంబోలో వచ్చిన 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార.
ఆ తర్వాత మగధీరతో ఆమె స్టార్ డమ్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలతో కలసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిందీ చందమామ.
ఇక సినిమాల్లో ఉండగానే ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకుంది కాజల్. 2020 అక్టోబర్ లో వీరి వివాహం జరిగింది.
2022 ఏప్రిల్ 19న కాజల్ దంపతులకు నీల్ కిచ్లూ అనే కుమారుడు పుట్టాడు. కాగా కాజల్ ఆమె కుమారుడు నీల్ ఒకే తేదీన జన్మించడం విశేషం.
కాగా ఇవాళ కాజల్ తన 40 వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రామాయణ్ లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..