రష్మిక బర్త్‌ డే స్పెషల్.. ఇది ఎన్నో పుట్టిన రోజో తెలుసా?

05 April 2025

Basha Shek

నేషనల్ క్రష్, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా శనివారం (ఏప్రిల్ 05) తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటోంది.

ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రష్మికకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

రష్మిక  కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో జన్మించింది.  సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ అందుకుంది

ఒక మోడలింగ్ షోలో రష్మికను చూసిన కన్నడ స్టార్ హీరో రక్షిత్‌ శెట్టి తన 'కిరిక్‌ పార్టీ' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్‌ ఇచ్చాడు.

తన మొదటి సినిమాకు రష్మిక కేవలం రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్‌ తీసుకుందట. ఇక ఛలో సినిమా కోసం 12 లక్షలు తీసుకుందట

ఇక ఆ తర్వాత రష్మిక రేంజ్ బాగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఒక సినిమా కోసం 10- 12 కోట్ల వరకు తీసుకుంటోంది

ఇక రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా పలు నగరాల్లో విలావవంతమైన ఇళ్లు ఉన్నాయట.

మొత్తానికి 28 సంవత్సరానికి గుడ్‌ బై చెప్పి 29వ ఏట అడుగు పెట్టిన రష్మిక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది.