శ్రీలీల హ్యాండ్ బ్యాగ్‌లో ఏమేం ఉంటాయో తెలుసా? ఊహించలేరు
TV9 Telugu
09 August 2024
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరోయిన్లలో శ్రీలీల కూడా ఒకరు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ
ఆ తర్వాత రవితేజ తో కలిసి ధమాకా సినిమాలో నటించింది. ఇది ఏకంగా 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక బాలకృష్ణతో కలిసి శ్రీలీల నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో బాలయ్య కూతురిగా నటించిందీ బ్యూటీ.
దీని తర్వాత స్కంద, ఆది కేశవ, ఎక్స్ ట్రార్డినరి మ్యాన్, గుంటూరు కారం తదితర సినిమాల్లో మెరిసింది శ్రీలీల.
అయితే వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో కొంచెం గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతోంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్, రవితేజ, నితిన్ తదితర స్టార్ హీరోలతో కలిసి క్రేజీ ప్రాజెక్టల్లో నటిస్తోందీ కన్నడ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే శ్రీలల గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే..ఆమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది.
ఇక శ్రీలీల హ్యాండ్ బ్యాగ్ లో ఏం ఉంటాయో తెలుసా? ఫోన్, ఎయిర్‌పోడ్స్, అమ్మవారి కుంకుమ ఎప్పుడూ ఈ అమ్మడి బ్యాగులో ఉంటాయట.
ఇక్కడ క్లిక్ చేయండి..