పూల చీరలో కట్టిపడేస్తోన్న హనీరోజ్.. అందాల తార ఫోటోస్ చూశారా ?.. 

10 September 2023

Pic credit - Instagram

వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హనీరోజ్. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ బ్యూటీ. 

ఈ సినిమాలో హనీరోజ్ అందం, అభినయం తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. 

కానీ అనుకున్నంతగా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తుతుంది. 

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. 

ఇక ప్రస్తుతం పూల చీరలో హనీరోజ్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. షిఫాన్ పూల చీరలో ఎంతో అందంగా కవ్విస్తోంది ఈ కేరళ కుట్టి. 

క్రీమ్ కలర్ పూల చీరలో ముదురు గులాబీ రంగు బ్లౌజ్ కాంబినేషన్ ఎంతో ఆకట్టుకుంది. చీరకు తగ్గట్టే మ్యాచింగ్ పింక్ చెవిపోగులు ధరించింది హనీ. 

 ఆ ముఖంపై చెరిగిపోని అందమైన నవ్వు, కట్టిపడేసే ఆ కనులు  హనీరోజ్  మరింత అందంగా కనిపించేలా చేస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

తెలుగుతోపాటు కన్నడ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది హనీ రోజు. బాయ్ ఫ్రెండ్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.