రామ్‌ చరణ్‌ 'గ్లోబల్‌ రేంజ్‌' ఇది.. ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు 

11 December 2023

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌

ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో వరల్డ్‌ వైడ్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడీ టాలీవుడ్‌ స్టార్‌ హీరో

తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చి చేరింది

అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ కు రామ్‌ చరణ్‌ ఎంపికైనట్లు పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది

రామ్‌ చరణ్‌తో పాటు గతంలో షారుఖ్ ఖాన్, ఆదా శర్మ, దీపికా పదుకొనే, రాశి ఖన్నా తదితరులు ఈ అవార్డును దక్కించుకున్నారు

ఇక సినిమాల విషయానికొస్తే.. డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో నటిస్తున్నాడు రామ్‌ చరణ్‌