ఈ దశాబ్ద కాలంలో నాకు బాగా నచ్చిన సినిమా ఇదే: హీరో నాని 

26 June 2025

Basha Shek

నేచురల్ స్టార్‌ నాని ఇటీవలే హిట్‌-3 సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో మోస్ట్‌ వయొలెంట్‌గా కనిపించి ఫ్యాన్స్‌ ను  మెప్పించాడు నాని.

థియేటర్లలో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన హిట్‌-3 సినిమా  ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది

హిట్ 3 సినిమాలో మోస్ట్ వయలెంట్ హీరోగా ఆకట్టుకున్న నాని నిర్మాతగానూ  100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ సొంతం చేసుకున్నాడు.

దీని తర్వాత ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు న్యాచురల్ స్టార్. దసరా సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నాని ఒక సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలో తనకు నచ్చిన చిత్రాల్లో  ఒకటని కితాబిచ్చారు.

భారీ బడ్జెట్ సినిమాల మధ్య వచ్చిన ఈ చిత్రం భావోద్వేగం, వ్యక్తిగత జీవితంపై  శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని హీరో నాని పేర్కొన్నారు.

ఇటీవల వ్యక్తిగతంగా తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిన చిత్రమిదేనని నాని వెల్లడించారు. ఇంతకీ న్యాచురల్ స్టార్ నాని మది దోచిన మూవీ ఏదో తెలుసా?

కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మెయి జగన్‌(తెలుగులో సత్యం సుందరం). గతేడాది రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది