అరుదైన నక్షత్రానికి మహేష్ బాబు పేరు..

09 August 2023

Pic Credit - Instagram

సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విదేశాల్లోనూ ఆయనకు ఫాలోయింగ్ ఉంది  

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు . ఆయన పుట్టిన రోజును మహేష్ ఫ్యాన్స్ సంబరంగా జరుపుకుంటున్నారు 

సోషల్ మీడియాలో మహేష్ బాబు పేరును ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఆయన ఫోటోలను వైరల్ చేస్తున్నారు

తాజాగా మహేష్ బాబుకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే మహేష్  పేరు మీద చాలా రికార్డులు ఉన్న విషయం తెలిసిందే.  

మహేశ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు ఆయనకు ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు.

అరుదైన నక్షత్రాల్లో ఒక నక్షత్రానికి సూపర్ స్టార్ మహేశ్ బాబుగా నామకరణం చేశారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు పేరును అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసింది గ్లోబల్ స్టార్ రిజిస్ట్రేషన్

గెలాక్సీలో అత్యంత ప్రేమగా ఇష్టపడే నక్షత్రం ఇదేనంటూ వారు పేర్కొన్నారు. ఇక, ఈ విశేష ఘనత సాధించిన తొలి తెలుగు హీరో మహేశ్‌ బాబు కావడం విశేషం

RA:12H33M29S నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టారు. భూమధ్య రేఖకు కుడివైపు ఆరోహణలో ఉన్న నక్షత్రానికి మహేశ్ బాబు పేరు