19 November 2023
తరగని అందానికి అసలు రహస్యమిదే.. త్రిష డైట్ సీక్రెట్ తెలుసా..
Pic credit - Instagram
త్రిష.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ టాప్ హీరోయిన్. దాదాపు రెండు దశబ్దాలుగా కథానాయికగా దక్షిణాది చిత్రపరిశ్రమను ఏలుతుంది.
ఇటీవలే లియో సినిమాతో హిట్ అందుకున్న ఈముద్దుగుమ్మ.. ఇప్పుడు తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది..
నలభై ఏళ్ల వయసులోనూ మరింత అందంగా కనిపిస్తూ ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది హీరోయిన్ త్రిష.
డైట్ విషయంలో త్రిష ఎలాంటి రాజీ పడదు. కేవలం పోషకమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఫ్యాటీ జంక్ ఫుడ్స్ తినదు.
గ్రీన్ టీ, సిట్రస్ పండ్లు తీసుకుంటుంది. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తుంది త్రిష. అలాగే రోజూ యోగా కూడా చేస్తుంది. ప్రీహ్యాండ్, కార్డియో వ్యాయమాలు.
అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతుంది. తన రోజు ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటుంది. అలాగే దానిమ్మ రసం తీసుకుంటుంది.
ఇంట్లో చేసే రొట్టెలు, ఆమ్లెట్స్, పెరుగు మాత్రమే తీసుకుంటుంది. పిండి పదార్థాలకు త్రిష దూరం. బాదం, పిస్తా, కాజు తీసుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.