ఇన్ స్టా లో భర్తను, షారుక్ ను కాకుండా నయన్ ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరో తెలుసా..
3 september 2023
Pic Credit - Instagram
సౌత్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో నటి నయనతార ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
లేడీ సూపర్ స్టార్ గా చాలా స్టార్డమ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ. ఇక ఇప్పుడు ఈ చిన్నది బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది
తన సినిమా ప్రమోషన్స్ కే కాదు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయన తార.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది నయన తార. మొదటి పోస్ట్ తన ఇద్దరు పిల్లల వీడియోను షేర్ చేసింది నయన్
తన పిల్లలను ఎత్తుకున్న వీడియోకి రజినీకాంత్ జైలర్ చిత్రంలోని టైగర్ కా హుకుమ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసింది నయన్.
ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయన్ కేవలం రెండు గంటల్లోనే నాలుగున్నర లక్షల మంది ఆమెను ఫాలో చేస్తున్నారు.
నయన్ మాత్రం ఐదుగురినే ఫాలో అవుతోంది. తన భర్త విఘ్నేష్ తర్వాత షారుక్ ఖాన్, అనిరుధ్, ది రౌడీ పిక్చర్స్, ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను ఫాలో అవుతోంది.
ఇక నయనతార నటిస్తున్న జవాన్ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమాలో నయన్ యాక్షన్ సీన్స్ తోనూ అదరగొట్టనుంది.
ఇక్కడ క్లిక్ చేయండి