నటి కాకపోయి ఉంటే నిత్య ఏం చేసేదో తెలుసా? అసలు ఊహించలేరు

TV9 Telugu

18 August 2024

చేసింది తక్కువ సినిమాలే అయినా దక్షిణాది స్టార్ హీరోయిన్ నిత్యా మేనన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ మలయాళ ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత నాని, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, శర్వానంద్ లాంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం చూరగొంది.

తన అభినయ ప్రతిభకు ప్రతీకగా  ఇటీవల జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా గెల్చుకుంది నిత్యా మేనన్.

ధనుష్ నటించిన తిరు చిత్తంబంలం (తెలుగులో తిరు) సినిమాలో నటనకు గానూ ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకుంది.

కాగా ఇటీవల ఒక సందర్భంలో మీరు సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏమయ్యవారు అని ప్రశ్నించగా..  షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది నిత్య

ఒకవేళ నేను నటిని కాకపోయి ఉంటే జర్నలిస్ట్ అయ్యదాన్నని, తన కల కూడా అదేనంటూ చెప్పుకొచ్చింది నిత్యా మేనన్.