రూ.85 కోట్లకు యువరాణి.. త్రిష ఏడాది సంపాదన తెలిస్తే షాకే..
Pic credit - Instagram
దాదాపు 20 ఏళ్లుగా టాప్ హీరోయిన్గా రాణిస్తోంది త్రిష. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలతో అలరిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో కుందవై పాత్రలో అద్భుతంగా కనిపించింది.
దీంతో విజయ్ దళపతి నటించిన లియో చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. దసరా సందర్భంగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయి భారీగా వసూళ్లు రాబడుతుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు త్రిష దాదాపు రూ.85 కోట్లు సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.3 కోట్లకు పైగా వసూళు చేస్తుంది త్రిష.
లియో చిత్రానికి రూ.4 కోట్లు తీసుకుందట. అలాగే ఇకపై కొత్త ప్రాజెక్టులకు రూ.10 కోట్లు వసూలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అజిత్ జోడిగా నటిస్తుంది.
త్రిష ప్రతి బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా నెలకు రూ.70 లక్షలు.. ప్రతి సంవత్సరం దాదాపు రూ.10 కోట్లకు పైగా ఆదాయన్ని సంపాదిస్తున్నట్లుగా సమాచారం.
త్రిషకు చెన్నైలో రూ.7 కోట్ల విలువైన భవనం కలిగి ఉంది. అలాగే హైదరాబాద్లో రూ.6 కోట్లు విలువైన ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లగ్జరీ కార్లు ఉన్నాయి.
రూ.80 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, రూ. 75 లక్షలు విలువైన బీఎమ్డబ్ల్యూ 5 సిరీస్, 60 లక్షల రేంజ్ రోవర్, రూ.5 లక్షల బీఎమ్డబ్ల్యూ కార్లు ఉన్నాయి.