అడివి శేష్ సినిమాకు శ్రుతిహాసన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఏంతంటే..
శ్రుతి హాసన్.. చాలా రోజుల తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ చిత్రంలో నటించింది. డిసెంబర్ 22న ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే డెకాయిట్ అనే సినిమాను అనౌన్స్ చేసింది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది హీరోయిన్ శ్రుతి హాసన్.
ఇందులో అడివి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. వీరిద్దరూ జోడిగా డెకాయిట్ అనే సినిమాను డైరెక్టర్ షానిల్ దేవ్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ మూవీస్ నిర్మిస్తున్నాయి.
శత్రువులుగా మారిన ఇద్దరు ప్రేమికుల కథగా డెకాయిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే అర్థమవుతుంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ కాబోతుంది.
అయితే ఈ సినిమా కోసం శ్రుతి హాసన్ ఏకంగా రూ.3 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. గత సినిమాలకు రూ.2.5 కోట్లు ఛార్జ్ చేసిందట ఈ బ్యూటీ.
కానీ డెకాయిట్ సినిమా కోసం మాత్రం భారీగానే వసూలు చేస్తుందట. అంత పెద్ద మొత్తంలో పారితోషకం ఇచ్చేందుకు మేకర్స్ ఒప్పుకున్నారంటే.. శ్రుతి పాత్రకు ప్రాధాన్యత ఉన్నట్లే.
ఇటీవల విడుదలైన టీజర్ లో అడివి శేష్, శ్రుతి హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.