ఓటీటీలో ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు వసూలు చేస్తోన్న హీరోయిన్..
TV9 Telugu
Pic credit - Instagram
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు అడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ వెబ్ సిరీస్, థ్రిల్లింగ్ వెబ్ స్టోరీస్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఓటీటీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కరీనా కపూర్. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 18 కోట్లు తీసుకుంటుంది. ఆ తర్వాత జాబితాలో ఉన్నది సమంత.
రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టింది సామ్. ఇందులో రాజీ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది.
ఇక ఇప్పుడు సిటాడెల్ సిరీస్‌తో మరోసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయనుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటిస్తుండగా.. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు.
త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇందుకోసం సమంత ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తుంది.
సాధారణంగా తెలుగులో ఒక్కో సినిమాకు సామ్.. రూ. 4 నుంచి రూ. 4.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఖుషి తర్వాత మరో ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకోలేదు.
కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది సామ్. మయోసైటిస్ సమస్య కోసం అమెరికా, భూటాన్ దేశాల్లో ఇమ్యూనిటి ట్రీట్మెంట్ తీసుకుంది.
ఇటీవలే సొంతంగా ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించింది. అలాగే సిటాడెల్ డబ్బింగ్ సైతం కంప్లీట్ చేసింది. ఇక త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేస్తానంటూ హింట్ ఇచ్చేసింది.