బాబోయ్.. రష్మిక అన్ని భాషలు మాట్లాతుందా ?.. మల్టీటాలెంటెడ్.. 

19 October 2023

Pic credit - Instagram

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ అందుకుంది రష్మిక మందన్నా. దీంతో ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ క్యూకట్టాయి. 

ప్రస్తుతం రష్మిక హిందీలో యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన అమ్మాయి పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్సాన్స్ వచ్చింది. 

పుష్ప 2, యానిమల్ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉంటుంది. తాజాగా నెట్టింట చిట్ చాట్ చేసింది. 

ఈ క్రమంలోనే మీరెన్ని భాషలు మాట్లాడగలుగుతారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ.. చేతి వేళ్లతో వన్ టు త్రీ అంటూ 6 అని చెప్పేసింది. 

రష్మిక మొత్తం ఆరు భాషలు మాట్లాడగలదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. 

రష్మిక మొత్తం ఆరు భాషలు మాట్లాడగలదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.