26 September 2023

బాబోయ్.. నయనతార ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఎన్ని కోట్లంటే.. 

Pic credit - Instagram

ఇటీవలే జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. దీంతో ఇప్పుడు బీటౌన్‏లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 

జవాన్ తర్వాత నయనతారకు హిందీలో మరిన్న ఆఫర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు.

జవాన్ చిత్రానికి నయన్ రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నయన్.

రెండు దశాబ్దాల కెరీర్ లో దాదాపు రూ.183 కోట్లు సంపాదించినట్లుగా సమాచారం. హైదరాబాద్, చెన్నై, కేరళతో సహా నగరాల్లో అనేక ఇళ్లు ఉన్నాయట. 

కేరళలోని అత్యంత విలాసవంతమైన ఆస్తులలో నయనతార పూర్వీకుల ఇల్లు ఒకటి. హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న ప్రాంతమైన బంజారాహిల్స్ పరిసరాల్లో ఉన్నాయి.

కొన్ని సంవత్సరాల క్రితం నయనతార ఒక ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసింది. నయన్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఇళ్లు విలువ దాదాపు రూ.100 కోట్లు. 

అలాగే ఆమె గ్యారెజీలో బిఎమ్‌డబ్ల్యూ 5 ఎస్, మెర్సిడెస్ జిఎల్‌ఎస్ 350 డి, ఫోర్డ్ ఎండీవర్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఇన్నోవా క్రిస్టా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. 

తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి 2011లో రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు నయన్. ఇటీవల నయన్ 9 స్కిన్ బ్రాండ్ చర్మ సంరక్షణ ఉత్పత్తులను  విడుదల చేసింది.