28 September 2023
డయానా మరియం గురియన్ నుంచి నయనతారగా.. పేరు వెనకున్న చరిత్ర..
Pic credit - Instagram
లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.1000 కోట్లు రాబట్టింది.
సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతున్న ఈ బ్యూటీ అసలు పేరు డయానా మరియం గురియన్. నయనతార పేరు వెనక పెద్ద కథే ఉంది.
కాలేజీలో చదువుతున్న సమయంలో మోడలింగ్ చేస్తున్న ఆమెను మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ చూసి సినిమాలో నటించాలని అడిగాడు.
ఈ సినిమా చేసేందుకు నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ రోజు సెట్‌లో దర్శకుడు అతడిని 'నీ పేరు మార్చుకోవడానికి ఒప్పుకుంటావా?' అని అడిగారట.
అందుకు నయన్ ఒప్పుకుంది. కానీ రోజులు గడుస్తున్నా.. సినిమాకు, నయనతారకు పేరు పెట్టలేదు. దీంతో నాకు పేరు ఉందా లేదా అని అడిగిందట నయన్.
దీంతో 20-30 మంది పేర్లు వెతికాను. అందులో మీకు నచ్చిన పేరు మీరే ఎంచుకోండి అని డైరెక్టర్ చెప్పారట. దీంతో ఆమె ఈ పేరు సెలక్ట్ చేసుకుంది.
డయానా మరియం గురియన్ పేరు కాస్త నయనతారగా మారింది. ఇప్పుడిదే పేరు సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటుంది నయన్. ఇటు తెలుగులోనూ మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.