నయనతార ఫిట్‍నెస్ రహస్యం ఇదే.. ఇంత సింపుల్‏ లైఫ్‏స్టైలా ?.. 

Pic credit - Instagram

15 October 2023

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార. తెలుగు, తమిళంలో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. 

ఇటీవలే జవాన్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది నయన్. దీంతో ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. 

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వెండితెరపై కథనాయికగా అలరిస్తోంది. ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ అందరిని షాక్ గురిచేస్తుంది నయన్. 

ఇక నయనతార ఫిట్నెస్ రహస్యం.. రోజు తీసుకునే డైట్ గురించి తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. అవును. ఎందుకంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఆమెది. 

 నిత్యం వర్కవుట్స్ చేస్తుంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం యోగా తప్పనిసరి ఆమె దినచర్యలో. అలాగే ఎక్కువ సమయం నిద్రించేందుకు ప్రయత్నిస్తుందట. 

క్రష్ డైట్ చేయకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటుంది. పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం తీసుకుంటుంది. ఇక షుగర్ వస్తువులకు నయన్ దూరం. 

అలాగే వ్యాయమానికి ముందు పోస్ట్ సెషన్ లో కొబ్బరి నీరు తీసుకుంటుంది. అలాగే ఎప్పుడూ బరువు పెరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ మితంగా తింటుంది.

అందం కోసం ఎక్కువగా పండ్ల రసాలు తీసుకుంటుంది నయన్. అలాగే జంక్ ఫుడ్.. మసాలా ఫుడ్ కాకుండా కేవలం ఇంటి ఫుడ్ తీసుకుంటుందట నయన్.