30 September 2023
ఒక్కో షోకు శ్రీముఖి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా..
Pic credit - Instagram
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలాకీతనంతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని అలరిస్తుంది.
అంతేకాకుండా గతంలో బిగ్బాస్ షోతో మరింత ఫేమస్ అయ్యింది శ్రీముఖి. ఆ షోలో అబ్బాయిలకు గట్టిపోటీ ఇచ్చి టైటిల్ వరకు వెళ్లి రన్నరప్ అయ్యింది.
ఇటు టీవీల్లో షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది శ్రీముఖి. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోస్ పంచుకుంటుంది.
ఇక ఇప్పుడు శ్రీముఖి రెమ్యునరేషన్ గురించి ఫిల్మ్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ బ్యూటీ ఒక్కో షోకు రూ. లక్ష నుంచి లక్ష యాభై వేలు తీసుకుంటుందట.
ఇక సినిమాలకు సపరేట్ గా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఓవైపు యాంకరింగ్, మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కీలకపాత్రలో నటించింది శ్రీముఖి. ఇందులో కీర్తి సురేష్ స్నేహితురాలి పాత్రలో నటించింది.
ఈ మూవీ తర్వాత తెలుగులో శ్రీముఖికి మరిన్ని అవకాశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ప్రిన్సెస్ లుక్లో షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
పట్టు పరికిణిలో ఒంటినిండా నగలతో అచ్చం రాజకుమారిల ముస్తాబయ్యింది శ్రీముఖి. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.