అదితి రావు హైదరీ ఎంత సంపాదించిందో తెలుసా.. ఒక్క సినిమాకు కోటి.. 

Pic credit - Instagram

29 October 2023

సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అదితి రావు హైదరీ. అక్టోబర్ 28న ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతున్నారు. 

 తెలుగులో చివరిగా మహా సముద్రం సినిమాలో నటించింది. ఇందులో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించగా.. కథానాయికగా అదితి రావు హైదరీ కనిపించింది. 

తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక సినిమాల్లో నటించింది. ఇక ఈ బ్యూటీ కొన్నాళ్లుగా హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. 

ఇప్పటికే వీరిద్దరు కలిసి ఈవెంట్లలో పాల్గొనడంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ పెద్ద కవిత్వం రాశారు సిద్ధార్థ్. 

అదితి ఇప్పటి వరకు రూ. 65 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆమె ఒక సినిమాకి దాదాపు కోటి రూపాయలు తీసుకుంటుందని తెలుస్తోంది. 

సినిమాలతోపాటు.. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి కూడా సంపాదిస్తుంది. అదితి ముంబైలోని ఒక కోటి రూపాయల విలువైన విలాసవంతమైన హవేలీలో నివసిస్తుంది. 

అలాగే ఆమె వద్ద Mercedes-Benz, Audi Q7, BMW మోడల్‌ లగ్జరీ కార్లు ఉన్నాయి. అదితి తాత హైదరాబాద్ నిజాం మహ్మద్ సాహెల్ కబర్ హదరీ. 

 తెలంగాణలోని వనపర్తికి రాజు. ఆమె అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కోడలు. ఆ విధంగా అమీర్ ఖాను బంధువు అవుతుంది. అదితి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.