17 October 2023
Pic credit - Instagram
రూ.500 నుంచి ఇప్పుడు రూ.5 కోట్ల వరకు.. త్రిష రెమ్యునరేషన్..
1999లో జోడీ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది త్రిష. ఇందులో సహయ నటిగా కనిపించింది. ఆ తర్వాత హీరోయిన్గా నటించి మెప్పించింది.
దాదాపు 23 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కథానాయికగా ఓ వెలుగు వెలుగుతోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోస్ సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.
చాలా కాలం బ్రేక్ తీసుకున్న త్రిష.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఈ బ్యూటీ క్రేజ్ ఇండస్ట్రీలో మళ్లీ పెరిగింది.
దీంతో ఇప్పుడు తెలుగు, తమిళంలో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం విజయ్ దళపతి జోడిగా లియో సినిమాలో నటిస్తోంది త్రిష.
అయితే మొదటి సినిమాకు త్రిష రూ.500 జీతం తీసుకుందని టాక్. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు రూ. 5 కోట్లకు పైగా తీసుకుంటుంది.
పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత త్రిష రెమ్యునరేషన్ పెంచేసింది. విజయ్ దళపతి నటిస్తోన్న సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగు, తమిళంలో మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో తన పారితోషికాన్ని మరింత పెంచాలని యోచిస్తోందట త్రిష.
ఇక తన తదుపరి చిత్రాలకు త్రిష దాదాపు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు అభిమానులు.
ఇక్కడ క్లిక్ చేయండి.