త్రిషకు  బాగా ఇష్టమైన టాలీవుడ్‌ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు..

04 May 2025

Basha Shek

సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష 42వ పుట్టిన రోజు నేడు. 1983 మే 4న చెన్నైలో జన్మించిందీ అందాల తార.

దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా త్రిషకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఈ సందర్భంగా త్రిష పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

BBA చదివిన త్రిష  1999లో ‘మిస్‌ చెన్నై’ కిరీటం అందుకుంది. ఇక జోడి సినిమాలో సిమ్రన్‌ స్నేహితురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

'నీ మనసు నాకు తెలుసు' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది త్రిష. ఆ తర్వాత ప్రభాస్ 'వర్షం' సినిమాతో తన కెరీర్‌ గ్రాఫ్‌ మారిపోయింది.

ఇక త్రిషకు కమల్‌ హాసన్‌, ఆమీర్‌ ఖాన్‌, వెంకటేశ్‌ అంటే  చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది

ఆమిర్ ఖాన్ తో నటించకపోయినా కమల్ హాసన్, వెంకటేష్ తో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ బ్యూటీ క్వీన్

 వెంకటేష్ తో కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నమో వెంకటేష వంటి హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది.