స్టార్ హీరో అయితే ఏంటి? 600 కోట్ల సినిమాను వద్దన్న సాయి పల్లవి!
11 May 2025
Basha Shek
ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న క్రేజ్, డిమాండ్ వేరు. ఇది ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది.
గార్గి తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి. కానీ అమరన్ సినిమాతో ఏకంగా రూ.800 కోట్ల సినిమాను ఖాతాలో వేసుకుంది.
ఆ తర్వాత అక్కినేని అందగాడు నాగచైతన్యతో కలిసి తండేల్ అనే బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. ఈ మూవీ కూడా 100 కోట్లు దాటేసింది
ప్రస్తుతం బాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీతగా నటిస్తోందీ న్యాచురల్ బ్యూటీ.
వీటి సంగతి పక్కన పెడితే.. సినిమాలో కథ, తన పాత్ర నచ్చితే కానీ సాయి పల్లవి చిత్రాలను అంగీకరించరన్నది అందరికీ తెలిసిందే.
ఇంతకు ముందు భోళా శంకర సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని కూడా తిరస్కరించిందీ అందాల తార.
ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సరసన లియో చిత్రంలో నటించే అవకాశం ముందుగా సాయిపల్లవికే వచ్చిందట.
అయితే పాత్ర తనకు సంతృప్తిని కలిగించకపోవడంతో రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాతనే ఈ మూవీలోకి త్రిష జాయిన్ అయ్యిందట
ఇక్కడ క్లిక్ చేయండి..