సాయి పల్లవికి బాగా ఇష్టమైన తెలుగు హీరో ఎవరో తెలుసా?

11  February 2025

Basha Shek

మొన్న అమరన్ మూవీతో పెద్ద హిట్ అందుకుని, ఇప్పుడు తండేల్ తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి

దీంతో ఈ న్యాచురల్ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ అమ్మడి యాక్టింగ్ పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి

నటనా పరంగా సినిమా ఇండస్ట్రీలోనే మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే సాయి పల్లవి చాలా డిఫరెంట్.

 హీరోయిన్ అనే పొగరు, గర్వం అలాంటివి ఏమీ సాయి పల్లవిలో ఉండవు.. ఏ పాత్ర చేసినా ప్రాణం పెట్టి నటిస్తుంది.

కాగా తండేల్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది.

ఈ నేపథ్యంలోనే తెలుగులో తన ఫేవరేట్ హీరో ఎవరో బయటకు చెప్పేసింది. ఇది విని  అందరూ షాక్ అవుతున్నారు.

తనకు అందరికంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  అంటే చాలా చాలా ఇష్టమని, ఆయన సినిమాలు అన్ని చూస్తానంది సాయి పల్లవి.

పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే ఇష్టమని అందుకే ఆయనకు డై హార్డ్ ఫ్యాన్ గా మారానని చెప్పుకొచ్చిందీ లేడీ పవర్ స్టార్.